ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGPSC: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. వెంటనే ఆ వెబ్ సైట్ చూడండి..

ABN, Publish Date - Jan 08 , 2025 | 08:35 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) గ్రూప్-3 ( Group 3) ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

Telangana Public Service Commission

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) గ్రూప్-3 (Group-3) ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ కీకి సంబంధించి జనవరి 12వ తేదీ సాయంత్రం వరకూ అభ్యంతరాలు స్వీకరించున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ విధానంలోనే తెలపాలని, అలాగే అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలుంటే అక్కడే జత చేసి పంపాలని సూచించింది. పూర్తి వివరాల కోసం తమ అధికారిక వైబ్ సైట్ https://www.tspsc.gov.in/ చూడాలని విజ్ఞప్తి చేసింది.

Hyderabad: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. హైకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు..


కాగా, గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,365 గ్రూప్-3 ఉద్యోగాలకు టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల కోసం తెలంగాణ వ్యాప్తంగా 1,401 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మెుత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 2,69,483 మంది మాత్రమే పరీక్షలకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాగా, రెండ్రోజుల్లో గ్రూప్‌-2 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని కూడా విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం ఇప్పటికే ప్రకటించారు.


ఈ వార్త కూడా చదవండి:

King Fisher: మద్యం ప్రియులకు షాక్.. కింగ్‌ ఫిషర్ బీర్లు బంద్..

KTR: ఆ కేసు గురించి ఆందోళన వద్దు..

Updated Date - Jan 08 , 2025 | 08:47 PM