Share News

TGPSC Vs BRS: బీఆర్‌ఎస్ నేతకు పరువునష్టం దావా నోటీసులు

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:56 PM

TGPSC Vs BRS: గ్రూప్‌ 1 ఫలితాలకు సంబంధించి బీఆర్‌ఎస్ నేత రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. వారంలోపు సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.

TGPSC Vs BRS: బీఆర్‌ఎస్ నేతకు పరువునష్టం దావా నోటీసులు
TGPSC Vs BRS

హైదరాబాద్, ఏప్రిల్ 12: బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్‌ రెడ్డికి (BRS Laest Enugula Rakesh Reddy) టీజీపీఎస్సీ (TGPSC) పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని గులాబీ నేతకు టీజీపీఎస్సీ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది. వారం రోజుల్లో సమాధానం చెప్పనట్లైతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. తదుపరి టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని ఆంక్షలు విధించింది.


రాకేష్ రెడ్డి ఏమన్నారంటే

గ్రూప్‌ 1 మెయిన్స్‌‌లోని అన్ని పేపర్లను రీ వాల్యుయేషన్ చేయాలని, వాల్యుయేషన్‌లో జరిగిన తప్పిదాలను ప్రభుత్వం సరిద్దాలని రాకేష్ రెడ్డి ఇటీవల పెట్టిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. గ్రూప్‌ 1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. గ్రూప్ -1 మెయిన్స్ రాసిన వారిలో 40 శాతం తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారని.. కానీ వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకులో రాలేదని తెలిపారు. ఈ మెయిన్స్ పరీక్షలను 45 కేంద్రాల్లో నిర్వహిస్తే కేవలం రెండు కేంద్రాల్లోనే 72 మంది ఎలా ట్యాప్‌ ర్యాంక్‌లో నిలిచారో టీజీపీఎస్సీ చెప్పాలన్నారు. టీజీపీఎస్సీ ద్వారా తెలుగు మీడియంను చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు.

Inter Supplementary Exams: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపుకు తుది గడువు ఇదే


18, 19వ కేంద్రాల్లో అవకతవలకు జరిగాయనే అనుమానం ఉందన్నారు. ఏపీపీఎస్సీలో 6 వేల పేపర్లను దిద్దేందుకు 40 రోజుల సమయం తీసుకుంటే.. ఇప్పుడు 20 వేల పేపర్లను అతి తక్కువ సమయంలో ఎలా దిద్దారని ప్రశ్నించారు. గ్రూప్ పరీక్షల నిర్వహణే తప్పుల తడక అంటూ రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీజీపీఎస్సీ సీరియస్ అయ్యింది. తప్పుడు ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందే అంటూ రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

Inter Supplementary Exams: ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపుకు తుది గడువు ఇదే

Preity Zinta: తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్‌కి ప్రీతిజింటా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 05:02 PM