Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Jan 25 , 2025 | 10:26 AM
Phone Tapping: తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా గవర్నర్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక మలుపు తిరిగింది. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి (Tripura Governor Indrasena Reddy) టెలిఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించిన సమయంలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్నారు.
కాగా.. ఫోన్‌ట్యాపింగ్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు సంబంధించి నేతల ఫోన్లే ట్యాపింగ్ గురైనట్లు అంతా భావించారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్‌లో బీజేపీకి సంబంధించి నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న ఇంద్రసేనరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనా రెడ్డి పీఏను కూడా విచారించారు అధికారులు. ఇంద్రసేనరెడ్డి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూసుకున్న నేపథ్యంలో.. ఆయనను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓలా, ఉబర్ వాడుతున్నారా.. ఒక్కో ఫోన్‌లో ఒక్కో రేటు..!
మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంద్రసేన రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేదానిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్‌మ్యాన్‌లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఒక ప్రాధమిక అంచనాకు వచ్చిప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: ఘోర ప్రమాదం.. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. చివరికి ఏమైందంటే..
KCR: కేసీఆర్ ఇంట విషాదం.. కన్నీటిపర్యంతమైన మాజీ సీఎం
Read Latest Telangana News And Telugu News