Hyderabad: కలకలం రేపుతున్న జంట హత్యలు.. మృతదేహాలు ఎలా దొరికాయంటే..
ABN, Publish Date - Jan 14 , 2025 | 02:57 PM
హైదరాబాద్ నార్సింగి(Narsingi)లో దారుణ ఘటన వెలుగు చూసింది. సంక్రాంతి (Sankranti) వేళ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం (Ananta Padmanabhaswamy Temple) గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది.
హైదరాబాద్: నార్సింగి(Narsingi)లో దారుణ ఘటన వెలుగు చూసింది. సంక్రాంతి (Sankranti) వేళ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం (Ananta Padmanabhaswamy Temple) గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్థానికంగా ఉండే చిన్నారులు, యువకులు గాలిపటాలు ఎగరవేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు వారు అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. దీంతో చిన్నారులు, యువత అంతా కలిసి గుట్టపైకి చేరుకున్నారు.
అయితే గాలిపటాలు ఎగరవేస్తుండగా అవి తెగిపడడంతో పక్కనే ఉన్న పొదల్లోకి యువకులు వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి వణికిపోయారు. పొదల్లోకి వెళ్లిన యువకులకు ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో వారి నోట మాట రాలేదు. దీంతో వెంటనే అక్కడ్నుంచి పరుగులు పెట్టారు. అనంతరం100కి డయల్ చేసి సమాచారాన్ని పోలీసులకు అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు సైతం రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డాయి.
మృతుల్లో ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని దుండగలు మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళతో ఉన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. అతని తలను బండరాయితో మోది హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తగలబెట్టారని తెలిపారు. ఇద్దరి మృతదేహాలు ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ముందుగా మహిళపై హత్యాచారం చేసి అనంతరం అతడిని అంతమెుందించినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున ఖాళీ మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. నిందితులు మద్యం మత్తులో హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జంట హత్యలకు పాల్పడిన నిందితులను పట్టుకునే దిశగా దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Piyush Goyal : పసుపు బోర్డుతో కలిగే లాభాలు చెప్పిన కేంద్రమంత్రి
Sankranti CelebrationS 2025: నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో సందడిగా సంక్రాంతి సంబురాలు
Updated Date - Jan 14 , 2025 | 03:25 PM