Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..హెచ్‌సీఏ చీఫ్ డుమ్మా
ABN , Publish Date - Apr 01 , 2025 | 08:44 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తింది. అది కాస్తా తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే.. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది.

హైదరాబాద్, ఏప్రిల్01: ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతోన్నారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అందుబాటులో లేరు. వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్‌కు దూరంాగ ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తింది. అది కాస్తా తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే.. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది.
ఈ మెయిల్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
NRI: రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి
TDP Formation Day:ఫిలడెల్ఫియాలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు
NRI: డాలాస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన
Husband Marries Wife to Lover: Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి
Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు
Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్