Malreddy Ranga Reddy: అందుకోసం రాజీనామా చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే
ABN, Publish Date - Apr 03 , 2025 | 03:06 PM
Malreddy Ranga Reddy: రేవంత్ రెడ్డి కేబినెట్‌ను విస్తరిస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేేపథ్యంలో కేబినెట్‌లో చోటు దక్కించుకోనేందుకు ఆశవాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని పలువురు సీనియర్లు దేశ రాజధాని ఢిల్లీ బాట పడుతున్నారు. ఆ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలిసి తన మనస్సులోని మాట చెప్పారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 03: తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిసి కోరినట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తనకు కేబినెట్‌లో చోటు ఇవ్వాలని వీరికి గతంలో లేఖ సైతం రాసినట్లు గుర్తు చేశారు.
తనకు మంత్రి పదవి కేటాయించడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నేతలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలన్నారు. ప్రస్తుతం ఆరు జిల్లాలకు చెందిన నేతలకే మంత్రి వర్గంలో చోటు కల్పించారని చెప్పారు.
అయితే మంత్రివర్గంలో తనకు చోటు దక్కక పోయినా.. రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రిపదవి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అందుకోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానని..నా స్థానంలో ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారో చెబితే.. వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానని మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు.
అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు మంత్రిపదవి ఇవ్వాలని ఇప్పటికే పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి వివరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలను సమన్వయం చేసుకొంటు ముందుకు వెళ్లాలంటే.. అక్కడ ఎవరో ఒకరు మంత్రిగా ఉండాలని ఎమ్మెల్యే రంగారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతోందంటూ ఇటీవల వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో చోటు దక్కించుకోనేందుకు ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. వారంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకొని.. అధిష్టానం పెద్దలను కలిసి వారి ఆశీస్సుల కోసం తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అదీకాక.. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తోపాటు పలువురు నేతలు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానం నేతలను కలిసి కేబినెట్ విస్తరణపై చర్చలు జరుపుతూన్నారు. దీంతో ఉగాది పండగకంటే ముందే తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ ఓ ప్రచారం జరిగింది.
మరోవైపు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నర కావోస్తుంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు మంత్రి పదవులు దక్కలేదు. ఆయా జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేలంతా తమను అదృష్టం వరిస్తోందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనకు చరమగీతం పాడి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో..ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు పదవుల కోసం క్యూ కడుతూన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ
KTR: రేవంత్ ప్రభుత్వానిది రియల్ ఎస్టేట్ ఆలోచన
Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ
BJP: ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే..
CM Revanth Reddy: సర్వాయి పాపన్నకు సీఎం రేవంత్ నివాళి
Read Latest Telangana News and Telugu News
Updated Date - Apr 03 , 2025 | 03:14 PM