ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Snehaja Jonnalagadda: 2024లో 7.5 లక్షల మందికి పాస్‌పోర్ట్‌లు!

ABN, Publish Date - Jan 04 , 2025 | 05:30 AM

రాష్ట్రంలో పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిణి స్నేహజ జొన్నలగడ్డ చెప్పారు.

  • రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల దరఖాస్తులు

  • త్వరలో మరిన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు

  • ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి స్నేహజ

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారిణి స్నేహజ జొన్నలగడ్డ చెప్పారు. పెరుగుతున్న దరఖాస్తులకు అనుగుణంగా స్లాట్‌లు పెంచుతున్నామని, అతి తక్కువ వ్యవధిలోనే పాస్‌పోర్టులు జారీచేస్తున్నామని తెలిపారు. గతంతో పో లిస్తే ఇప్పుడు సాధారణ పాస్‌పోర్టులు 5-7 రోజుల్లో, తత్కాల్‌ 1-3 రోజుల్లోనే జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మీడి యా సమావేశంలో 2024లో ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం అందించిన సేవలను వివరించారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మంది పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 7.5 లక్షల మందికి జారీ చేసినట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి, విదేశీ పర్యాటకంపై ఆసక్తి పెరిగినందున.. రాష్ట్రంలో పాస్‌పోర్టు దరఖాస్తులు పెద్దఎత్తున వస్తున్నాయని చెప్పారు.


పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ స్లాట్లు పెంచుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని కేంద్రాల్లో వారంలో, ఇతర జిల్లాల్లో రెండు మూడు రోజుల్లోనే జనరల్‌ అపాయింట్‌మెంట్‌ స్లాట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో కొత్త జిల్లాల్లో మరిన్ని పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలను ప్రారంభించనున్నామన్నారు. మారుమూల ప్రాం తాల ప్రజల కోసం మొబైల్‌ పాస్‌పోర్ట్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చామని.. ఈ వ్యాన్‌ ప్రస్తుతం కామారెడ్డిలో ఉందని ఆమె చెప్పారు. పాస్‌పోర్ట్‌ ఇంటర్వ్యూలో సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు ప్రతి గురువారం సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కా ర్యాలయంలో గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ప్రపంచంలో ఏ దేశ వీసా పొందాలన్నా పాస్‌పోర్టు పునరుద్ధరణ గడువు కనీసం 6 నెలలుండాలని చెప్పారు. అందువల్ల గడువుకు 6 నెలల ముందే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాస్‌పోర్టు పోగొట్టుకుంటే కొత్తదాని కోసం పోలీసు ఎఫ్‌ఐఆర్‌ అవసరం లేదని, మీసేవలో ‘లాస్‌ సర్టిఫికేట్‌’ కోసం దరఖాస్తు చేయాలని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో ఎవరికైనా రెండేళ్లు జైలుశిక్ష పడితే.. అలాంటి వారికి పాస్‌పోర్టులు జారీచేయడం లేదన్నారు. విడాకుల కేసులు కోర్టు ల్లో ఉన్న దంపతుల పిల్లలకు పాస్‌పోర్టు కావాలంటే ఆ జంట అనుమతులు కావాల్సి ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్య కోసం, డిపెండెంట్‌ వీసాపై విదేశాలకు వెళ్లేవారు తమ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు అటెస్టెడ్‌ చేయించుకునే వెసులుబాటు ఆర్పీవో కార్యాలయంలో ఉందని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా విదేశీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను ఆమె విడుదల చేశారు.

Updated Date - Jan 04 , 2025 | 05:30 AM