Share News

Kaleshwaram Project Investigation: 23న రాష్ట్రానికి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:46 AM

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తుది దశలో, జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌ రానున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన వ్యక్తులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయడం మిగిలి ఉంది.

Kaleshwaram Project Investigation: 23న రాష్ట్రానికి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీలపై తుది దశ విచారణలో భాగంగా ఈ నెల 23వ తేదీన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ హైదరాబాద్‌కు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో ఇప్పటిదాకా కీలక ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. నివేదికకు కూడా ఆయన తుదిరూపం ఇచ్చే పనిలో పడ్డారు. విచారణలో భాగంగా కీలక అధికారులందరినీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటిపారుదలశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ సమయంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ మిగిలి ఉంది. ఈ ముగ్గురిని విచారణకు హాజరై సహకరించాలని కోరుతూ కమిషన్‌ సమన్లు పంపాలని భావిస్తోంది. ఈ నెల 23వ తేదీన జస్టిస్‌ పీసీ ఘోష్‌ హైదరాబాద్‌కు చేరుకున్నాక కేసీఆర్‌ తదితరులకు సమన్ల జారీపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:47 AM