Share News

K Lakshman: బీసీ గర్జన కాదు.. కాంగ్రెస్‌ మాయ గర్జన

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:37 AM

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా పోరు గర్జన పేరుతో ఆ పార్టీ రాజకీయ డ్రామాకు తెర లేపిందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశ చరిత్రను పరిశీలిస్తే, ఆ పార్టీ బీసీలకు ఏనాడూ న్యాయం చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ఇ

K Lakshman: బీసీ గర్జన కాదు.. కాంగ్రెస్‌ మాయ గర్జన

  • ఆ పార్టీ పాలనలో బీసీలకు ఒరిగిందేమి లేదు: కె.లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రె్‌సపార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, బీసీలను మరోసారి మోసం చేయడానికి కుట్ర పన్నుతోందని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా పోరు గర్జన పేరుతో ఆ పార్టీ రాజకీయ డ్రామాకు తెర లేపిందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశ చరిత్రను పరిశీలిస్తే, ఆ పార్టీ బీసీలకు ఏనాడూ న్యాయం చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా బీసీలకు 22 సీట్లే ఇచ్చి వారి హక్కులను కాల రాస్తూ వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో బీసీ రిజర్వేషన ్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న నినాదంతో ఆ వర్గం వారిని మభ్యపెట్టేందుకు మరో కొత్త పథకం వేస్తోందని ఎంపీ లక్ష్మణ్‌ పేర్కొన్నారు.


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(4), 16(4) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు 9వ షెడ్యూల్‌తో సంబంధం లేకుండానే బీసీ రిజర్వేషన్లను పెంచే పూర్తి అధికారమున్నదని లక్ష్మణ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో బీసీలకు పూర్తిన్యాయం జరిగేలా బీజేపీ నిరంతరం పోరాడుతోందని, మోదీ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పించిందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని, బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 03 , 2025 | 04:37 AM