Share News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ 3 పార్టీలు కుమ్మక్కు: లక్ష్మణ్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 05:34 AM

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ- పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ 3 పార్టీలు కుమ్మక్కు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ- పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ ఆరోపించారు. వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎంకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం అభ్యర్ధులనే పోటీలో పెట్టలేదన్నారు. మూడు పార్టీల కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటంతోపాటు వక్ఫ్‌బోర్డులో పారదర్శకత కోసమే కేంద్రం కొత్త చట్టం తెచ్చిందని అన్నారు.


కంచ గచ్చిబౌలి భూముల విక్రయాలు నిలిపేయాలని పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు మాట్లాడారని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రాంతీయ పార్టీల ముసుగులో డీఎంకే ద్వారా కాంగ్రెస్‌ ఆడిస్తున్న నాటకంలో బీఆర్‌ఎస్‌ పాత్రధారి అని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - Apr 06 , 2025 | 05:34 AM