Kadiyam Srihari: సుప్రీం తీర్పును శిరసావహిస్తా
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:20 AM
పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అవసరమైతే ఉపఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఉప ఎన్నిక వస్తే.. పోటీ చేసి గెలుస్తా: కడియం
హనుమకొండ, ఫిబ్రవరి9 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అవసరమైతే ఉపఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో కడియం మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎ్‌సకు లేదన్నారు. ‘‘పదేళ్లలో బీఆర్‌ఎస్ 36మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోలేదా? వారిలో మంత్రులైన వారు లేరా..? పార్టీకి రాజీనామా చేయకుండా వారు చేరలేదా..?’’ అని ప్రశ్నించారు.
నియోజకర్గ అభివృద్ధే లక్ష్యంగా తాను కాంగ్రె్‌సలో చేరానని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంబరపడుతున్నారని, ఆప్ ఓటమికి బీఆర్‌ఎస్ ప్రధాన కారణమని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్, కవిత జైలుకు వెళ్లారని, ఫలితంగా ఆప్ దారుణంగా ఓడిపోయిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కడియం పూర్తి మద్దతును ప్రకటించారు.