మహిళల హక్కులపై అవగాహన పెంచుకోవాలి
ABN, Publish Date - Mar 09 , 2025 | 12:49 AM
మహిళల హక్కుల పట్ల అవగాహన పెంచుకున్నపుడే ధైర్యంగా ముందుకు పోవచ్చని మంథని అడిషనల్ సివిల్ జడ్జి మూల స్వాతిగౌడ్ అన్నారు. స్థానిక కోర్టులో అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
మంథని, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళల హక్కుల పట్ల అవగాహన పెంచుకున్నపుడే ధైర్యంగా ముందుకు పోవచ్చని మంథని అడిషనల్ సివిల్ జడ్జి మూల స్వాతిగౌడ్ అన్నారు. స్థానిక కోర్టులో అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా 650 కేసులు పరిష్కరించారు. రూ. 17,46,060 జరిమానాలు వసూలు చేశారు. జడ్జిలు మూల స్వాతిగౌడ్, అనురాఽధ, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి రఘోత్తంరెడ్డి, ఏపీపీ సందీప్, ఏజీపీ అంజనే యులు, సీఐలు రాజు, ప్రసాదరావు, ఎస్‌ఐలు రమేష్, చంద్రకుమార్, నరేష్, ప్రసాద్, న్యాయవాదులు సుభాష్, విజయ్‌కుమార్, శశిభూష ణ్‌కాచే, భాగ్య, రాజేందర్‌లు పాల్గొన్నారు.
Updated Date - Mar 09 , 2025 | 12:49 AM