బాబు జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:30 AM
మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఆధికారికంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యా ప్తంగా ఘనంగా నిర్వహించారు.

సిరిసిల్ల, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఆధికారికంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యా ప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాల యాల్లో, వివిధ పార్టీల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి కలె క్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే, గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి, అఽధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేశా రు. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడు తూ బాబు జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయ న చూపిన బాటలో పయనించాలని అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో బాబు జగ్జీవన్‌రాం చిత్రపటానికి అధికా రులు పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్‌కుమార్, కమిష నర్ సమ్మయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి రాజమనో హర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ఉధ్యానవ న శాఖ అధికారి లత, షెడ్యూల్ కులాల సహాయ అధికారి విజయలక్ష్మీ, అంబేద్కర్ సంఘాల ప్రతిని ధులు కత్తెర దేవదాస్, రాగుల రాములు, అవునూరి వెంకట్రాజం, కంసాల మల్లేశం, లింగంపల్లి సత్యనా రాయణ, సెస్ డైరెక్టర్ కొట్లెపల్లి సుధాకర్, కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు వనిత, తదితరులు పాల్గొన్నా రు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి చైర్మన్ సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులు తెలిపారు.
వివిధ పార్టీల ఆధ్వర్యంలో...
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవ న్‌రాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద బాబు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలి పారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకా ష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అకునూరి బాలరా జు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూప రెడ్డి, కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ నాయకులు వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, కమలాకర్‌రావు, రవి, తదితరులు పాల్గొ న్నారు. బీఅర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో బాబు జగ్జీ వన్‌రాం చిత్రపటానికి బీఆర్‌ఎస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులు తెలిపారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మహిళ అధ్యక్షురాలు వనజ, బీఆర్‌ఎస్ నాయకులు రాఘవరెడ్డి, లింగంపల్లి సత్యనారాయ ణ, మల్లారెడ్డి, అగ్గిరాములు, జక్కుల యాదగిరి, బండ నర్సయ్య, మాట్ల మధు, వెంకటరాములు, తదితరులు నివాళులు తెలిపారు.