ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:29 AM
ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు ఉన్నా యని రామగుండం ఎంఈవో గడ్డం చంద్రయ్య అన్నారు. ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్‌లో భాగంగా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జెడ్‌పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను గురువారం సందర్శిం చారు.

కోల్‌సిటీటౌన్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు ఉన్నా యని రామగుండం ఎంఈవో గడ్డం చంద్రయ్య అన్నారు. ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్‌లో భాగంగా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జెడ్‌పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను గురువారం సందర్శిం చారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్‌ల్యాబ్, డిజిటల్ విద్యాబోధన, లైబ్రేరీ స్పోర్స్ మెటిరియల్‌పై అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు జింక మల్లేశం, సమ్మయ్య, పీడీ లక్ష్మణ్, పాల్గొన్నారు.
సుల్తానాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు మెరుగయ్యా యని మండల విద్యాధికారి రాజయ్య అన్నారు. గర్రెపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో గురువారం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పలు వసతులను చూపించారు. నారాయణరావు పల్లి, గొల్లపల్లి, ఐతరాజుపల్లి, కాట్నపల్లి పాఠశాలలకు చెందిన విద్యార్థు లకు ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. హెచ్‌ఎంలు కవిత, లక్ష్మయ్య, అంజయ్య,చంద్రమౌళి, తిరుపతిరెడ్డి,మహిపాల్ రెడ్డి, రాజయ్య సీఆర్‌పీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్,: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ట్విన్నింగ్ కార్యక్రమం జరిగింది. పెద్దంపేట, కిష్టంపేట, ఇదిలాపూర్, కాల్వశ్రీరాం పూర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కాల్వశ్రీరాంపూర్ ఉన్నత పాఠ శాలలో సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించారు. ఐఎఫ్‌పి ప్యానెల్‌బోర్డు ద్వారా పాఠ శాలలో ఎలా నేర్చుకోవాలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఈఓ మహేష్, హెచ్‌ఎం సునీత, పాల్గొన్నారు.
ఎలిగేడు: సుల్తాన్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్వినింగ్ ఆఫ్ స్కూల్(ఒకపాఠశాలను మరొక పాఠశాలకు అనుసంధానం చేయడం) కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, పాఠశాల గ్రాంధాలయం, ఐఎఫ్‌పి ప్యానల్ ద్వారా మాథ్స్, సైన్స్, క్విజ్, లైబ్రరీ రూమ్ నిర్వహణ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, నిర్వహించిన కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మండల విద్యాధికారి అనసూరి నరేంద్రచారి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం గండ్ర దేవేందర్‌రావు, మాజీ సర్పంచ్ అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, ధూళి కట్ట హైస్కూల్ హెచ్‌ఎం బిజిలి సదయ్య, సంతోష్‌రెడ్డి, అనిత, శ్రీనివాస్, ప్రభాకర్‌రావు, గీత, భాస్కర్, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
ఓదెల: పొత్కపల్లిలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో సౌక ర్యాలు కల్పిస్తున్నారని ఏంఈఓ రమేష్ అన్నారు. ట్విన్నింగ్‌లో భాగంగా పొత్కపల్లి, కొలనూర్ హైస్కూళ్లను సందర్శించారు. యుపీఎస్, ఎంపిపిఎస్‌పాఠ శాలల తో పాటు వశిష్ఠ,కేరళ పాఠ శాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంబయ్య,ఏసుదాసు,మహేందర్,లక్ష్మణ స్వామి,రజిత తో పాటు ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
జూలపల్లి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంఈవో సరస్వతి ఆధ్వర్యంలో ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వడు కాపూర్, తెలుకుంట ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో చర్లపల్లి, నాగులపల్లి, కాచాపూర్, వెంకట్రావుపల్లి గ్రామాల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా పాఠశాలల ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గోన్నారు.
Updated Date - Mar 14 , 2025 | 12:29 AM