Share News

దేశ ప్రజలను విడగొట్టడానికి బీజేపీ కుట్రలు..

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:51 AM

దేశంలోని ప్రజలను విడగొట్టాల ని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

దేశ ప్రజలను విడగొట్టడానికి బీజేపీ కుట్రలు..

వేములవాడ టౌన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రజలను విడగొట్టాల ని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూ ర్‌ గ్రామంలోని 7,8వ వార్డుల్లో జైబాపు, జైభీమ్‌, జై సంవిదాన్‌ పాదయాత్ర కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తూ పాదయాత్రను కొనసాగించాలని కాంగ్రెస్‌ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఢిల్లీలో జంతర్మంతర్‌ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహించామని, పలు పార్టీలు పాల్గొని మద్దతు తెలియ జేయడం అభినందనీయమనిన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు పోతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:51 AM