Share News

ఆరు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించాలి

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:54 PM

ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని పర్లపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు.

ఆరు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించాలి
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

తిమ్మాపూర్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని పర్లపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన సిలబస్‌తో ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్‌వాడీల్లో భోధిస్తున్నారని అన్నారు. మహిళాలు ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గర్బిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌దేశాయ్‌, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీపీవో జగదీశ్వర్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాజిత, సీడీపీవో శ్రీమతి, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:54 PM