విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:57 PM
ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్టీపీసీ ద్వైపాక్షిక సంఘం(ఎన్‌బీసీ) సభ్యుడు బాబర్ సలీంపాషా హామీ ఇచ్చారు. రామగుండం ఎన్టీపీసీ విశ్రాం త ఉద్యోగుల సంక్షేమ సంఘం(రేవా), మజ్దూర్ యూనియన్ (ఐఎన్‌టి యుసి) ఆదివారం పీటీఎస్ జ్యోతి ఫంక్షన్ హాల్‌లో సూపర్ మీట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగుల సమ్మేళనాన్ని నిర్వహించారు.

జ్యోతినగర్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్టీపీసీ ద్వైపాక్షిక సంఘం(ఎన్‌బీసీ) సభ్యుడు బాబర్ సలీంపాషా హామీ ఇచ్చారు. రామగుండం ఎన్టీపీసీ విశ్రాం త ఉద్యోగుల సంక్షేమ సంఘం(రేవా), మజ్దూర్ యూనియన్ (ఐఎన్‌టి యుసి) ఆదివారం పీటీఎస్ జ్యోతి ఫంక్షన్ హాల్‌లో సూపర్ మీట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగుల సమ్మేళనాన్ని నిర్వహించారు. సమావేశానికి బాబర్ సలీం పాషా, ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్) విజయ్‌కుమార్ సిక్దర్ హాజరయ్యారు. బాబర్ మాట్లాడుతూ మెరుగైన పెన్షన్ స్కీం అమలయ్యేలా ప్రయత్నిస్తానని తెలిపారు.
ఈపీఎస్ 95 పెన్షన్‌ను 7,500 రూపాయలు, డీఏతో కలిపి అమలు చేయాలని, సెల్ఫ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను బెన్‌ఫిట్ స్కీం ప్రకారం యాజమాన్యం చెల్లించాలని, పీఆర్‌ఎంఎస్ వైద్యంకు సంబంధించి ఉన్న ఇబ్బందులను తొలగించాలని తీర్మానించారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఇచ్చిన రేవా కార్యాలయాన్ని ప్రాంభించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆకుల రాంకిషన్ అధ్యక్షత జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో ఉన్న 300 మంది రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సట్టు ముత్యాలు, తిరుమల సురేందర్, సిహెచ్.శ్రీపతిరావు, దుర్గం నర్సయ్య, రాంనారాయణ, లాలయ్య, వెంకటేశ్వర్లు, గోపాల్‌రెడ్డి, ఎన్టీపీసీ హెచ్‌ఆర్ అధికారులు ప్రవీణ్ కుమార్ చౌదరి, ఆదేశ్ పాండే, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 11:57 PM