‘సిమ్స్’లో ఘనంగా ఫ్రెషర్స్ డే
ABN, Publish Date - Mar 03 , 2025 | 12:19 AM
విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదం డ్రులకు పేరు తీసుకురావాలని సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రిన్సిపాల్ హిమబిందు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి కళాశాల మైదానంలో ఉద్బవ్-25 కార్యక్రమా నికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు.
కళ్యాణ్‌నగర్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదం డ్రులకు పేరు తీసుకురావాలని సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రిన్సిపాల్ హిమబిందు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి కళాశాల మైదానంలో ఉద్బవ్-25 కార్యక్రమా నికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కళాశాలల్లో రామగుండం మెడికల్ కళాశాల ప్రథమ స్థానంలో ఉందని, విద్యార్థులు పట్టు దలతో చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకు రావాలని సూచించారు. కళాశాల ప్రారంభ మైన మూడు సంవత్సరాలలో విద్యార్థులను చదువుల్లో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కళాశాల విద్యార్థులు గడిచిన రెండేళ్లలో మంచి ఫలితాలను సాధించారని, త్వర లోనే సిమ్స్‌కు పీజీ సీట్లు కూడా మంజూరవు తాయన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
‘సిమ్స్’ ఫ్రెషర్స్‌డేలో విద్యార్థుల మధ్య గొడవ
గోదావరిఖనిలో సింగరేణి మెడికల్ సైన్స్ (సిమ్స్)లో శనివారం రాత్రి నిర్వహించిన ఫ్రెషర్స్ డే జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య గొడవకు దారితీసింది. మెడికల్ కళాశాల మైదానంలో ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు డ్యాన్స్ చేస్తుండగా తృతీయ సంవత్సర విద్యార్థులు అసభ్య పదజాలంతో హేళనచేశారు. ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు డ్యాన్స్ చేసిన వారికి తెలుపడంతో వాగ్వాదం మొదలైంది. తమను హేళన చేసిన వారిపై చర్యలు
తీసుకోవాలంటూ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు తెల్లవారుజామున 4గంటలకు ప్రిన్సిపాల్ హిమబిందుకు ఫిర్యాదు చేశారు. సీనియర్ విద్యార్థులను పిలిపించి క్షమాపణ చెప్పాలని ప్రిన్సిపాల్ సూచించారు. హేళన చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు పట్టుబట్టారు. రాత్రంతా విద్యార్థులంతా హాస్టల్ రూమ్‌లో రచ్చ రచ్చ చేశారు. హేళన చేసినవారు తమ కాళ్లపై పడాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ప్రిన్సిపాల్ గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, షీటీమ్ సిబ్బందికి ఫిర్యాదుచేశారు. ఉదయం కళాశాలకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింప చేశారు. ఆరు నెలల క్రితం సీనియర్లు ఓ జూనియర్‌కు జరిగిన ఘటన మరుక ముందే సిమ్స్‌లో మళ్లీ ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం...
ప్రిన్సిపాల్ హిమబిందు
విద్యార్థుల కోరిక మేరకు ప్రెషర్స్ డేను ఏర్పాటు చేశాం. సీనియర్లు జూనియర్లపై అసభ్యంగా మాట్లాడడం బాధాకరం. కమిటీ కూర్చొని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
Updated Date - Mar 03 , 2025 | 12:19 AM