మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేయాలి
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:32 AM
యాసంగి సీజన్‌లో నిర్ధేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొ న్నారు.

పెద్దపల్లిటౌన్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో నిర్ధేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొ న్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేసి 48 గంటల్లో చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలి పారు. పంట దిగుబడికి తగ్గట్టుగానే అవసరమైన ఏర్పా ట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు గన్ని బ్యాగులపై నివేదిక అందించాలని కలెక్టర్ సూచిం చారు. మార్కెటింగ్ అధికారితో సమన్వయం చేసు కుంటూ అవసరమైన సామగ్రి కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు వడ్లకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు త్వరితగతిన తరలిం చాలన్నారు. హమాలీల కొరత రాకుండా చర్యలు తీసు కోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా డీఎం మార్కెటింగ్ శ్రీకాంత్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, పాల్గొన్నారు.
Updated Date - Mar 14 , 2025 | 12:33 AM