వైద్య విద్యార్థులు పేదలకు సేవలందించాలి
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:18 AM
పేదలకు వైద్యం అందించడంలో వైద్య విద్యార్థులు ముందుండాలని సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రిన్సిపాల్ హిమబిందు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కళ్యాణ్‌నగర్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పేదలకు వైద్యం అందించడంలో వైద్య విద్యార్థులు ముందుండాలని సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రిన్సిపాల్ హిమబిందు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగ రేణి నిధులతో 2023లో ప్రారంభమైన మెడికల్ కళాశాల రాష్ట్రంలోనే ఇతర మెడికల్ కళాశాలలకు ఆదర్శమని, అన్నీ హంగులతో ఈ మెడికల్ కళాశా లను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే పీజీ విద్య కూడా అందుబాటు లోకి రానున్నదని చెప్పారు. కళాశాలకు అనుబంధంగా జనరల్ ఆసు పత్రిలో 365 బెడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని, దీనికి అనుబంధంగా మరో 362 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి దశకు చేరుకుంటుందని, ఈ ఏడా దిలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారం భవుతాయని చెప్పారు. గైనకాలజిస్ట్, డెం టల్, ఆప్తమాలిక్, ల్యాప్రోస్కోపి, సిటీ స్కాన్ వంటి సౌకర్యాలను అందుబాటు లోకి తీసుకురావడంతో పాటు 22 డయా గ్నోస్టిక్ సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ మాట్లాడు తూ సింగరేణి నిధులతో ఏర్పాటు చేసిన సిమ్స్‌లో సింగరేణి కార్మికుల పిల్లలకు 7శాతం రిజర్వేష న్‌ను కల్పించామన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సిమ్స్ మెడికల్ కళాశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో వైద్య విద్యా ర్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతు లను ప్రదానం చేశారు. ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్, ప్రొఫెసర్లు రాజు, శ్రీదేవి, ఓబులేష్, అశోక్, అనంతబాబు, అనీల్, లక్ష్మి, శిరీష, ధర్మేందర్‌తో పాటు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 12:18 AM