ప్రజాపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:48 PM

కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలం లోని గోపాల్‌రావుపేట, దొంగతుర్తి గ్రామాలలోని వేం కటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకొని ప్రత్యే పూజలు నిర్వహించారు.

ప్రజాపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు

ధర్మారం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలం లోని గోపాల్‌రావుపేట, దొంగతుర్తి గ్రామాలలోని వేం కటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకొని ప్రత్యే పూజలు నిర్వహించారు. నర్సింహులపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి జాతరలో పాల్గొని మొక్కు లు చెల్లించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో శాసనసభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలో హోలీ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.

గత ప్రభుత్వం పోలీస్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టిందని, ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు సన్మానిం చారు. మార్కెట్‌ చైర్మెన్‌ లావుడ్య రూప్లా నాయక్‌, వైస్‌ చైర్మెన్‌ అరిగె లింగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, బ్లాక్‌ 2 అధ్యక్షుడు కోమటిరెడ్డి రవీందర్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు కొడారి హన్మయ్య, దేవి జనార్దన్‌, పాలకుర్తి రాజేశం గౌడ్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 11:49 PM