Share News

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఫూలే

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:58 AM

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహా త్మా జ్యోతిబా ఫూలేనని, ఆయన ఆశయ సాధన లో ప్రతి ఒక్కరు ముం దుకు సాగాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఫూలే

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యో తి) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహా త్మా జ్యోతిబా ఫూలేనని, ఆయన ఆశయ సాధన లో ప్రతి ఒక్కరు ముం దుకు సాగాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. సిరిసిల్ల కలెక్ట రేట్‌లో శుక్రవారం బీసీ సంక్షేమశాఖ శాఖ ఆధ్వ ర్యంలో మహాత్మా జ్యోతి బా ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫూలే జీవితం అంద రికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్క ర్త ఫూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడన్నా రు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి రాజ మనోహార్‌, డీపీఅర్‌వో వంగరిశ్రీధర్‌ పాల్గొన్నారు.

- జిల్లా ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో..

సిరిసిల్ల జిల్లా ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మాజ్యోతిబా ఫూలే జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, గడ్డం నర్సయ్య, బోప్ప దేవయ్య, అకునూరి బాలరాజు, కీసరి శ్రీనివాస్‌, జిల్లా ఫిషరీస్‌ చైర్మన్‌ చొప్పరి రామచంద్రం, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ జెల్ల వెంకటస్వామి, జిల్లా నాయకులు బోయిన దేవరాజ్‌, స్వామి, జంగాలపల్లి శేఖర్‌, కురుణాల అనిల్‌, చొక్కాల ప్రశాంత్‌, శ్రీనివాస్‌, కూనవేని పర్శరాములు, బొజ్జ కనుకయ్య, భద్రాచలం, వంకాయల కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:59 AM