స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ABN, Publish Date - Mar 09 , 2025 | 12:51 AM
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం సుల్తానాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు సమావేశం నిర్వహించారు. సంజీరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఘన విజయం సాధించడం గర్వకారణమన్నారు.
సుల్తానాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం సుల్తానాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు సమావేశం నిర్వహించారు. సంజీరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఘన విజయం సాధించడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదురుకోవాలన్నారు. వార్డు మెంబరు నుంచి జడ్పీటీసీ ఎంపీపీ పదవులను పార్టీ కైవసం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు అభిస్తుందని పదవులు వరిస్తాయని అన్నారు. తాను ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా, అందుబాటులో ఉంటానని, గ్రామాలలో పార్టీ విజయం కోసం ఇప్పటి నుంచే పని చేయాలన్నారు. నాయకులు కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, వేల్పుల రాజన్న పటేల్, కొమ్ము తిరుపతి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 09 , 2025 | 12:51 AM