సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:32 AM
జగిత్యాల, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేసిన గెరిల్లా పోరాట యోదుడు సర్ధార్ సర్వాయి పాప న్న గౌడ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించిన బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.

జగిత్యాల, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేసిన గెరిల్లా పోరాట యోదుడు సర్ధార్ సర్వాయి పాప న్న గౌడ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించిన బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, నాయకులు బండ శంకర్, రాజుకుమార్, సాయాగౌడ్, మెప్మా జిల్లా పరిపాలన అధికారి దుర్గపు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.