ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యం

ABN, Publish Date - Mar 21 , 2025 | 11:33 PM

రోడ్డు ప్రమాదాల నుం చి ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యమని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా చెప్పారు. శుక్రవారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల రోడ్‌ సేఫ్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌, రోడ్‌ సేఫ్టీపై నమ్మకం, భరోసా కలగాలన్నారు.

ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యం

కోల్‌సిటీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నుం చి ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యమని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా చెప్పారు. శుక్రవారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల రోడ్‌ సేఫ్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌, రోడ్‌ సేఫ్టీపై నమ్మకం, భరోసా కలగాలన్నారు. బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించాలని, నివారణ మార్గాలకు కృషి చేయా లన్నారు. రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలని, రహదారులపై అవసరమైన చోట వేగాన్ని నియం త్రించే స్పీడ్‌ బ్రేకర్లు, కెమెరాలు, లైట్లు, స్పీడ్‌ కెమెరాలు, జం క్షన్ల వద్ద పాదచారులు రోడ్డు దాటే వద్ద జీబ్రా క్రాసింగ్‌, ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలను సందర్శించి ప్రతీ విషయం తెలుసుకోవాలన్నారు.

రోడ్లపై విజిబుల్‌ పోలీ సింగ్‌ ఉండాలని, సీసీ కెమెరాలు, చైన్‌ స్నాచింగ్‌, గంజాయి, రాబరీ, ఇతర అక్రమ రవాణాలను అరికట్టాలని, డ్యూటీ సమయంలో సిబ్బంది, అధికారులు స్వీయ రక్షణ పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. పెద్దపల్లి, మంచి ర్యాల జోన్‌ పరిధిలోని జాతీయ రహదారి 63, ఎన్‌హెచ్‌- 363, రాష్ట్ర రహదారులు ఎస్‌హెచ్‌-1, ఎస్‌హెచ్‌-24, ఎస్‌ హెచ్‌-8తో పాటు ఇతర రోడ్లపై 2022 నుంచి 2024 వరకు జరిగిన ప్రమాదాల గురించి తెలుసుకున్నారు. అడిషన్‌ డీసీపీ (అడ్మిన్‌)రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్ర రావు, ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహులు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మల్లారెడ్డి, రామ గుండం ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:33 PM