ఫూలేను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు..
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:54 AM
సామాజిక న్యాయం కోసం బల హీనవర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే చూపిన మార్గదర్శకత్వంతో వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోం దని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు అన్నారు.

సిరిసిల్ల, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం కోసం బల హీనవర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే చూపిన మార్గదర్శకత్వంతో వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోం దని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు అన్నారు. శుక్రవారం సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద, జిల్లా గ్రంథాలయ సంస్థ భవనంలోఆధునిక యువ వైతాళికుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహా త్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ అహ్మాదాబాద్ ప్లీనరీలో రాహూల్‌గాంధీ దేశానికి తెలంగాణ దిక్సూ చిగా ఉందని తెలిపారని అన్నారు. కుల గణన చేసి బీసీలకు రాజకీ య, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయ డం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ సహచార మంత్రులు కలిసి ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు పెంచడం జరిగిందన్నారు. సిరిసిల్లలో జ్యోతిబా ఫూలే విగ్రహం లేకపోవడం బాధాకరమని అన్నారు. వచ్చే జయంతిలోపు ఫూలే కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని, వచ్చే సంవత్సరం విగ్రహానికి దండ వేసుకునే విధంగా ఉండాలని అన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేంద ర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, మాజీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవ రాజు, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, మాజీ మండల అధ్యక్షుడు వైద్య శివప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నర్సయ్య, పట్ట ణ కార్యదర్శి మ్యాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాన్ని సందర్శించిన మంత్రులు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారె కేంద్ర గ్రంథాలయాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు సందర్శించారు. జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. అనంతరం గ్రంథాలయంలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతులతో మాట్లా డారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇతర అంశాలను చర్చించారు. గ్రంథాల య సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణను సన్మానించారు. వారి వెంట కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గీతే, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు వైద్య శివప్రసాద్, దేవరాజు, బాలరాజు, గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.