మహనీయుల స్ఫూర్తితో సామాజిక అణిచివేతపై పోరాడాలి
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:01 AM
కార్మిక ఉద్యమ నిర్మాత, సీఐటీ యూ వ్యవస్థాపక అధ్యక్షుడు బిటి రణదీవే వర్ధంతిని ఆదివారం సీఐటీయూ ఆఫీసు శ్రామికభవన్‌లో నిర్వహించారు. రణదీవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ’సామాజిక న్యాయం- సీఐటీయూ అవగాహన’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

గోదావరిఖని, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కార్మిక ఉద్యమ నిర్మాత, సీఐటీ యూ వ్యవస్థాపక అధ్యక్షుడు బిటి రణదీవే వర్ధంతిని ఆదివారం సీఐటీయూ ఆఫీసు శ్రామికభవన్‌లో నిర్వహించారు. రణదీవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ’సామాజిక న్యాయం- సీఐటీయూ అవగాహన’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ బీటీ రణదీవే స్వాతంత్రోద్యమంలో ముఖ్యపాత్ర పోషించారని, ఆ సమయంలోనే కార్మిక వర్గాన్ని సంఘటితం చేశారన్నారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతి రేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి, ఐక్య పోరాటాలు నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. కార్మికవర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా సమ రశీల పోరాటాలకు నాయకత్వం వహించారని, దేశంలో సామాజిక అణిచి వేత, కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మిక వర్గం పోరాడాలని నిర్దేశించిన నాయకుడు బిటి రణదీవే అని అన్నారు. ఈనెల 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్, మతోన్మాద విధానాలను అనుసరిస్తోందన్నారు. సఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు మెండె శ్రీనివాస్, ఆర్‌జీ-1అధ్యక్షుడు ఆరెపల్లి రాజమౌళి, నాయకులు తోట నరహరిరావు, మహేష్, దాసరి సురేష్, రాములు, ఈదుల సాగర్, బండ్ర మహేశ్వరి, టీ సుజాత, బీ రజిత, వాణి, వాసవి, నర్సమ్మ, శంకరమ్మ, తిరుపతి పాల్గొన్నారు.