ఇసుక లారీలను నిలిపివేసేదెప్పుడు
ABN, Publish Date - Mar 12 , 2025 | 12:30 AM
ప్రభుత్వం ఏర్ప డితే రెండు రోజుల్లోనే ఇసుక లారీలను నిలిపివేస్తా మని ఇచ్చిన మాటాను మంత్రి మరిచారని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకేషిరవీందర్ ప్రశ్నిం చారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇసుకను బంద్ చేస్తామని హామీఇచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇసుక లారీలు నడుస్తున్నాయని ఆరోపించారు.

రామగిరి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్ప డితే రెండు రోజుల్లోనే ఇసుక లారీలను నిలిపివేస్తా మని ఇచ్చిన మాటాను మంత్రి మరిచారని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకేషిరవీందర్ ప్రశ్నిం చారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇసుకను బంద్ చేస్తామని హామీఇచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇసుక లారీలు నడుస్తున్నాయని ఆరోపించారు. మహదేవ్‌పూర్ నుం చి కమాన్‌పూర్ వరకు నిత్యం వరుస ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారన్నారు. కమాన్ పూర్ వద్ద పోలీసుల కళ్ల ఎదుటే కల్వచర్లకు చెందిన దొంతుల వాణి మృతి చెందిందన్నారు. ఇంకెంత మం ది ప్రాణాలు బలైతే ఇసుకను బంద్ చేస్తారని ఆవే దన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారయణగౌడ్, నాయకు లు కుమార్‌యాదవ్, భాస్కర్, ధర్ముల రాజసంపత్, కన్నూరి శ్రీశైలం, దామెర శ్రీనివాస్, సమ్మయ్య పాల్గొన్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం కేటాయించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఇసుక లారీలతో రహదారులు రక్తసిక్తం గా మారుతూ ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రవాణాను అరికడుతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికి అధికారం లోకి వచ్చి ఏడాది గడిచినా ఎందుకు నియంత్రిం చలేకపోతున్నారని మంతి శ్రీధర్‌బాబును ప్రశ్నిం చారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం వేలాది లారీలు నడుస్తున్నాయన్నారు. శంకర్, పొన్నం రాజేశ్వరి, అనిల్‌గౌడ్, వెంకటేష్, లక్ష్మిమల్లు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Mar 12 , 2025 | 12:30 AM