యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:02 AM
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని బీజేపీ రామగుండం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం ఎన్‌టీపీసీలో ట్రు ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 3కే రన్ నిర్వహించారు. ఈ రన్ గోదావరిఖని చౌరస్తా వరకు సాగింది. అనంతరం జరిగిన సభలో కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, ఆరోగ్యమే అసలైన సంపద అని, యువత, మహిళలు, ఉద్యోగస్థులు నిత్యం వ్యామాయం, నడక, జిమ్ అలవాటు చేసుకోవాలన్నారు.

కళ్యాణ్‌నగర్/జ్యోతినగర్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని బీజేపీ రామగుండం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం ఎన్‌టీపీసీలో ట్రు ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 3కే రన్ నిర్వహించారు. ఈ రన్ గోదావరిఖని చౌరస్తా వరకు సాగింది. అనంతరం జరిగిన సభలో కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, ఆరోగ్యమే అసలైన సంపద అని, యువత, మహిళలు, ఉద్యోగస్థులు నిత్యం వ్యామాయం, నడక, జిమ్ అలవాటు చేసుకోవాలన్నారు.
యువతకు సరైన దిశా, నిర్దేశం చేస్తేనే బలమైన సమాజం ఏర్పడుతుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించి యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలని కోరారు. జిమ్ నిర్వాహకులు ఝకీల్, ముజ్మిల్, ఫకృద్దీన్, దాసరి రాయలింగు, సుధాకర్, రాఘవరెడ్డి, కిరణ్, వినయ్, సమీర్, మారుతి, మంజు, ఆత్రేయ, అంజలి, నిలోఫర్ పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:02 AM