Share News

BRS Leader Kavitha: నేను కొంచెం రౌడీ టైపే

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:13 AM

కాంగ్రెస్‌ బెదిరింపులకు భయపడబోమని, names పింక్‌బుక్‌లో రాసుకుంటామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.కేసీఆర్‌ మంచోడు కావొచ్చు కానీ తాను కొంచెం రౌడీ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు

BRS Leader Kavitha: నేను కొంచెం రౌడీ టైపే

  • కాంగ్రెస్‌ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

  • బెదిరింపులకు పాల్పడే వారి పేర్లు పింక్‌ బుక్‌లో రాస్తాం

  • వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: కవిత

బాన్సువాడ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, తమ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడే వారి పేర్లను బరాబర్‌ పింక్‌బుక్‌లో రాసుకుంటాం అని.. వారిని విడిచిపెట్టేది లేదని బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ మంచోడు కావొచ్చు.. నేను కొంచెం రౌడీ టైపే’ అని ఆమె వ్యాఖ్యానించారు. బాన్సువాడలో తమ కార్యకర్తలను సతాయించిన వారిని, పోలీస్ స్టేషన్‌కు ఈడ్చిన వారిని క్షమించే ప్రసక్తే లేదన్నారు. బాన్సువాడలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సన్నాహక సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.. రజతోత్సవ మహాసభకు ఇంటికొకరు చొప్పున తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే మాట తప్పే ప్రభుత్వం అని, అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఆ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటికీ పంచి ఓట్లేయించుకున్నారని... ఇప్పుడు ఆ గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:15 AM