K. Kavitha: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు

ABN, Publish Date - Jan 23 , 2025 | 04:26 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల మీదకు, బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లపైకి దాడులకు వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘‘60 లక్షల మంది సైనికులున్న కుటుంబం బీఆర్‌ఎస్‌ పార్టీ.

K. Kavitha: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
  • మా పార్టీ ఆఫీసులపై దాడి చేస్తామంటే భయపడం

  • 60లక్షల సైనికులున్న పార్టీ బీఆర్‌ఎస్‌.. ఖబడ్దార్‌: కవిత

యాదాద్రి జనవరి 22 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల మీదకు, బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లపైకి దాడులకు వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘‘60 లక్షల మంది సైనికులున్న కుటుంబం బీఆర్‌ఎస్‌ పార్టీ. మా కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్‌ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు. ఖబడ్దార్‌..’’ అంటూ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని బుధవారం ఆమె దర్శించుకొన్నారు. తర్వాత భువనగిరి బైపా్‌సలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.


రౌడీ మూకలను వేసుకుని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే సంస్కృతి తమది కాదన్నారు. మూసీ నది కాలుష్యానికి కారణం కాంగ్రెసే అని ఆమె ఆరోపించారు. మూసీ ప్రాజెక్టును ఆ పార్టీ ఏటీఎంగా మార్చుకుందన్నారు. అంతకుముందు యాదగిరి గుట్ట ఆలయం వద్ద కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతీ నెలా స్వాతి నక్షత్రం రోజున గిరిప్రదక్షిణ చేయం ఎంతో ముక్తిదాయకమని, తనకు గిరిప్రదక్షిణ చేసే అదృష్టం కలగడం గొప్ప వరమని కవిత అన్నారు. కవిత బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి గిరిప్రదక్షిణోత్సవంలో పాల్గొని మెట్లదారిన కొండెక్కి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

Updated Date - Jan 23 , 2025 | 04:26 AM