KCR: కొండపోచమ్మసాగర్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కేసీఆర్
ABN, Publish Date - Jan 12 , 2025 | 04:43 AM
కొండపోచమ్మసాగర్ జలాశయంలో మునిగి ఐదుగురు యువకులు మరణించడం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం ఇవ్వాలి: హరీశ్
ప్రభుత్వం తగు ఆర్థికసాయం చేయాలి: కేటీఆర్, కవిత
ఘటనపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్ర్భాంతి
హైదరాబాద్, గజ్వేల్, న్యూఢిల్లీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కొండపోచమ్మసాగర్ జలాశయంలో మునిగి ఐదుగురు యువకులు మరణించడం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొండపోచమ్మ సాగర్‌లో యువకుల మృతి పట్ల కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భారంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌కు సూచించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కొండపోచమ్మ సాగర్ జలాశయంలో యువకుల మృతి తన హృదయాన్ని కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత యువకుల మృతి ఘటన పట్ల ఆవే దన వ్యక్తం చేశారు. విషాదంలో ఉన్న మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగు ఆర్ధిక సాయం చేయాలని వారు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. జలాశయాల పరిసర ప్రాంతాల్లో తగు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 04:43 AM