Share News

మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌ది

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:26 PM

కోడేరు మండల కేంద్రాన్ని సుందరీకరణ చేసిన ఘనత కేసీఆర్‌దేనని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నా రు.

మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌ది
కోడేరులో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి

కోడేరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : కోడేరు మండల కేంద్రాన్ని సుందరీకరణ చేసిన ఘనత కేసీఆర్‌దేనని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకు డు రఘువర్ధన్‌రెడ్డి ఇంటి ఆవరణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఒకప్పు డు మండల కేంద్రంలో రోడ్డుపై వరినాట్లు వేసు కొని నిరసన తెలిపిన పరిస్థితులు ఉన్నాయ న్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ సహా యంతో గ్రామాల్లో రోడ్లు వేసినట్లు తెలిపారు. ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో కార్యకర్తలు అఽధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఫ అనంతరం మండల పరిధిలోని బావా యిపల్లి గ్రామానికి వెళ్లి ఇటీవల తాజా మాజీ సర్పంచు కర్రెమ్మ భర్త మృతి చెందడంతో వారి ని ఓదార్చారు. గ్రామంలో గత కొన్ని రోజుల కింద మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సూర్య, రాజశేఖర్‌గౌడ్‌, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు శివారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, లింగారెడ్డి, శ్రీశైలం, నాయకులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేయాలి

ఊర్కొండ : వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్‌ కొమ్ము రాజయ్య కోరారు. ఆదివారం మండల కేంద్రంలో సభ వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, నరేష్‌, అంజి హరీష్‌, శేఖర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:26 PM