Kishan Reddy: ఢిల్లీలో రేవంత్ డ్రామాలు!
ABN, Publish Date - Apr 03 , 2025 | 04:30 AM
బీసీ సంఘాల ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నాకు దిగడం చూస్తుంటే 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలా కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

వెనక ఉండి ఆడిస్తున్న రాహుల్‌గాంధీ
బీసీలకు 42% రిజర్వేషన్లపైకాంగ్రె్‌సకు చిత్తశుద్ధి లేదు: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): బీసీ సంఘాల ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నాకు దిగడం చూస్తుంటే 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలా కనిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని, వారిని ఓటుబ్యాంకుగానే కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనప్పుడు.. పెంచుతామంటూ హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టంలేకనే రేవంత్‌రెడ్డి ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని, అసలైన బీసీ ద్రోహి ఆయనేనని ఆరోపించారు. రేవంత్ వెనక రాహుల్‌గాంధీ ఉండి ఈ డ్రామాలాడిస్తున్నారని ధ్వజమెత్తారు.
బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధాని అయితే జీర్ణించుకోలేక ఆయనపై రాహుల్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ మరిచిపోయిందని, కానీ, బీసీల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో గత్యంతరం లేక 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారని తెలిపారు. రాష్ట్రంలో 46 శాతం బీసీల జనాభా ఉందంటున్న సీఎం రేవంత్.. తన క్యాబినెట్‌లో 46ు మంది బీసీ మంత్రులకు చోటు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. బీసీలకు మంత్రి పదవులు రెండంటే రెండే ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బీసీలపై కపట ప్రేమలు చూపుతూ.. హామీల అమలు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 42శాతం వాటా అమలు చేసి ఆరుగురు బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
For More AP News and Telugu News
Updated Date - Apr 03 , 2025 | 04:30 AM