Rains Expected in Telangana: నేడు, రేపు అక్కడక్కడ వానలు

ABN, Publish Date - Apr 07 , 2025 | 04:24 AM

తెలంగాణలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది

Rains Expected in Telangana: నేడు, రేపు అక్కడక్కడ వానలు

హైదరాబాద్‌, విశాఖపట్నం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. సోమ, మంగళవారాల్లో పలుజిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్‌, ములుగు, జనగామ, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడే అవకాశముందని పేర్కొంది. ఈ రెండు రోజులు అన్ని జిల్లాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల్లోపే నమోదవుతాయని తెలిపింది. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:24 AM