Ponguleti: స్థానిక సంస్థల ఎన్నికలకు 15లోపు షెడ్యూల్‌

ABN, Publish Date - Feb 03 , 2025 | 03:52 AM

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 15వ తేదీ లోపు వెలువడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సూచించారు.

Ponguleti: స్థానిక సంస్థల ఎన్నికలకు 15లోపు షెడ్యూల్‌
  • కాంగ్రెస్‌ శ్రేణులతో మంత్రి పొంగులేటి

  • ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచన

వైరా, నేలకొండపల్లి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 15వ తేదీ లోపు వెలువడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకలో మంత్రి పొంగులేటి ఆదివారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన స్థానిక కాంగ్రెస్‌ నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. పుణ్యపురం గ్రామానికి చెందిన నేతలు.. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా అంశాన్ని ప్రస్తావించి పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సాదాబైనామా పరిష్కారానికి ఒక్క నెల రోజులు గడువు మాత్రమే ఇస్తామన్నారు. ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తామని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత భూభారతిలో సాదాబైనామాల పరిష్కారానికి నెల రోజుల పాటు అవకాశం ఇస్తామని చెప్పారు.


ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక, ఖరీ్‌ఫలో మిగిలిపోయిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని పలువురు కోరగా.. పొంగులేటి వెంటనే ఖమ్మం కలెక్టర్‌ ముజిమ్మిల్‌ఖాన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఖరీ్‌ఫలో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. పలువురు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కోసం అడగ్గా.. వైఎస్‌ హయాంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి ఇప్పుడు ఇల్లు కేటాయించబోమన్నారు. ఇళ్ల కేటాయింపులో పేదలకు తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అంతకముందు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన భక్తరామదాసు జయంత్యుత్సవాల్లో పొంగులేటి పాల్గొన్నారు. భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన భక్త రామదాసు జన్మస్థలం నేలకొండపల్లిని తరతరాలు గుర్తుంచుకునేలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నేలకొండపల్లి ధ్యాన మందిర అభివృద్ధికి పదిరోజుల్లో రూ.2.65కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 03:52 AM