Share News

అన్నీ రాజకీయ పార్టీల్లో అగ్రకులాల వారే

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:13 PM

దే శంలో ఎక్కడ చూసినా, ఏ పార్టీలో చూసి నా రాజకీయంగా అగ్రకులాలవారే రాజ్యాధి కారాన్ని ఏలుతున్నారని యాదవ విద్యావం తుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంక ట్‌యాదవ్‌ అన్నారు.

అన్నీ రాజకీయ పార్టీల్లో అగ్రకులాల వారే
భూత్పూర్‌లో ఏర్పాటు చేసిన యాదవుల విద్యావేదిక సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్‌యాదవ్‌

- యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్‌యాదవ్‌

భూత్పూర్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడ చూసినా, ఏ పార్టీలో చూసి నా రాజకీయంగా అగ్రకులాలవారే రాజ్యాధి కారాన్ని ఏలుతున్నారని యాదవ విద్యావం తుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంక ట్‌యాదవ్‌ అన్నారు. శనివారం మహబూబ్‌ నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండల కేంద్రంలో ని కేఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్లో దేవరకద్ర ని యోజవర్గంలోని వివిధ మండలాలకు చెం దిన యాదవ నాయకులతో యాదవ విద్యా వంతులవేదిక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వర కు ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కు లగణన చేయలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అ ధికారం లోకి వచ్చిన వెంటనే దేశంలో ఎక్క డ లేని విధంగా కులగణన చేసిందన్నారు. దాని వల్ల బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జనాభా ఎంత ఉందన్న లెక్క తేలిపోయిందన్నారు. రాష్ట్రంలో అన్నీ వర్గాల్లో బీసీల జనాభా 42 శాతం ఉందని అన్నారు. ఇంత జనాభా శా తంలో యాదవులు 30లక్షల మంది ఉన్నార ని, అంటే 10శాతం ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. పాల మూరు మునిసిపాలిటీ ముడా చైర్మన్‌ లక్ష్మ ణ్‌యాదవ్‌, యాదవ్‌ మహాసభ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు వెంకట్‌నర్సయ్యయాదవ్‌, రాష్ట్ర నా యకులు రవికుమార్‌యాదవ్‌, బైకని యాద వ్‌, లక్ష్మీనర్సింహయాదవ్‌, అంజన్నయాదవ్‌, జుర్రు నారాయణయాదవ్‌, భరత్‌కుమార్‌, విజయ్‌మోహన్‌, దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి నాయకుడు బత్తుల మల్లేష్‌యాద వ్‌, వివిధ మండలాల నుంచి వచ్చిన యా దవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 11:13 PM