Share News

అల్పాహారం బాగా లేకపోతే చెప్పాలి

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:16 PM

పాఠశాలల్లో అల్పాహారం నాణ్యత లేకుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు.

అల్పాహారం బాగా లేకపోతే చెప్పాలి
నిడ్జింత ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ విద్యను వింటున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- నిడ్జింతలో పాఠశాలల తనిఖీ

- సబ్జెక్టుల వారీగా విద్యార్థుల పురోగతి పరిశీలన

కొత్తపల్లి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో అల్పాహారం నాణ్యత లేకుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. శనివారం ఆమె కొత్తపల్లి మండలంలోని నిడ్జిం త ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించారు. అనంతరం గతేడాది జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థుల ఫలితాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థుల పురోగతిని సబ్జెక్టుల వారీగా పరిశీలించారు. పాఠశాలలో ప్రారంభించిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ విద్యను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగి వారి విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన తల్లిదండ్రుల సమా వేశంలో పాల్గొని మాట్లాడారు. బయో పార్కులో నాటిన మొక్కలను పరిశీలించి, వాటి పరిరక్షణపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు పలు సూచన లు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణారావు, గ్రామ కార్యదర్శి వెంకటేష్‌, ప్రధా నోపాధ్యాయుడు ఆంజనేయులు, లాజర్‌, విజయ్‌, సుజాత, దేవేంద్రప్ప, పీడీ కథలప్ప, శ్రీని వాస్‌, నగేశ్‌, ఆనందం, రామకృష్ణ, షఫీ తదితరులున్నారు.

Updated Date - Mar 15 , 2025 | 11:16 PM