జలాధివాసం నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:25 PM
తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవంగా పూజించే సప్త నదుల సంగమ క్షేత్రం, నాగర్‌కర్నూలు జిల్లా సరిహద్దు, ఏపీలోని ముచ్చుమర్రి సమీపంలో ఉండే సంగమేశ్వ రాలయం కృష్ణానది జలాధివాసం నుంచి బయట పడుతోంది.

కొల్లాపూర్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవంగా పూజించే సప్త నదుల సంగమ క్షేత్రం, నాగర్‌కర్నూలు జిల్లా సరిహద్దు, ఏపీలోని ముచ్చుమర్రి సమీపంలో ఉండే సంగమేశ్వ రాలయం కృష్ణానది జలాధివాసం నుంచి బయట పడుతోంది. కృష్ణానదిలో రోజురోజుకు తగ్గుతున్న నీటి మట్టం వల్ల సప్త నదుల సంగమక్షేత్రం సంగమేశ్వ రాలయంలోని గర్భాలయం జలాధివాసం నుంచి బయటప డుతుండటంతో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామయ్య శర్మ సోమవారం పూజలు నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఇంకా తగ్గుముఖం పడితే మరో వారం రోజుల్లో సంగమేశ్వ రాలయం పూర్తిగా బయటపడనుందని పురోహితులు తెలకపల్లి రఘురామయ్య శర్మ తెలిపారు. గత ఏడాది మహా శివరాత్రి పర్వదినంలోపే ఆలయం పూ ర్తిగా జలాధివాసం నుంచి బయట పడింది. కానీ, ఈ ఏడాది మహాశివరాత్రి ముగిసి 15 రోజులు గడుస్తున్నా మరో 15 రోజుల గడిస్తేగాని ఆలయం పూర్తిగా బయటపడే పరిస్థితి లేదు. అప్పుడు పూర్తి స్థాయిలో భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుంది.