మెడికల్ విద్యార్థుల గోడు వినేదెవరు?
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:13 PM
గద్వాల మెడికల్ కళాశాలను ఆగమేఘాల మీద ప్రారంభించిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు విద్యార్థు ల గోడు ఎందుకు పట్టించుకోవడం లేదని బీజే పీ నాయకులు ప్రశ్నించారు.

- కళాశాలలో పర్యటించిన బీజేపీ నాయకులు
గద్వాల, మార్చి 17(ఆంధ్రజ్యోతి): గద్వాల మెడికల్ కళాశాలను ఆగమేఘాల మీద ప్రారంభించిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు విద్యార్థు ల గోడు ఎందుకు పట్టించుకోవడం లేదని బీజే పీ నాయకులు ప్రశ్నించారు. హాస్టల్ లేదు, వసతులు లేవు, పర్యవేక్షణలేదు, రక్షణలేదు అంతా అగమ్యగోచరంగా ఉందని జిల్లా అధ్యక్షుడు రా మచంద్రారెడ్డి, జిల్లాప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి అన్నారు. సోమవారం మెడికల్ కళా శాలను పరిశీలించిన వారికి అనేక సమస్యలు చిత్రాలు తారసపడ్డాయి. విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా భోజన సరఫరా చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు వారికి ఏదైనా సమ స్య వస్తే ఎవరు బాధ్యులు, టెండర్లు ఎందుకు పిలవడంలేదని అని ప్రశ్నించారు. పట్టణానికి 5కిలోమీటర్ల దూరంలో నిర్మించిన కళాశాలకు భద్రత, రక్షణ కరువయ్యాయని అన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది లేదని సరిపడా లేరని అన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించా రు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎగ్బోటే, మహిళా మోర్చా జిల్లా అధ్య క్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపా ధ్యక్షురాలు బండల పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షు లు రజక నర్సింహ, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, అసెంబ్లీ మాజీ కన్వీనర్లు రామాంజనేయులు, కేకేరెడ్డి, మునిసిపల్‌మాజీ చైర్‌పర్సన్ అక్కల రమాదేవి, నాయకులు స్వప్న, చిత్తారి కిరణ్, మోహన్‌రెడ్డి, అనిల్, దేవదాసు ఉన్నారు.