Share News

పేటలో జైభీమ్‌ జైబాపు జైసంవిధాన్‌ పాదయాత్ర

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:39 PM

ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జైభీమ్‌ జైబాపు జైసంవిధాన్‌ పాదయాత్రను నారాయణపేటలో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి చేపట్టారు.

పేటలో జైభీమ్‌ జైబాపు జైసంవిధాన్‌ పాదయాత్ర
పేటలో జైభీమ్‌ జైబాపు జైసంవిధాన్‌ పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి తదితరులు

- కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు

నారాయణపేట, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జైభీమ్‌ జైబాపు జైసంవిధాన్‌ పాదయాత్రను నారాయణపేటలో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి గాంధీనగర్‌ గాంధీ విగ్రహం వరకు వారు పాదయాత్ర నిర్వహించారు. అనం తరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో గత 70 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తే నేడు బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో తిరోగమనంలో పయనిస్తు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతీ గడపకు వెళ్లి జైభీమ్‌ జైబా పు జైసంవిధాన్‌ కార్యక్రమం గురించి వివరిస్తా మన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కోనంగేరి హన్మంతు, మాజీ చైర్మన్‌ బండి వేణుగోపాల్‌, సరాఫ్‌ నాగరాజు, సుధాకర్‌, పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం, కాంగ్రెస్‌ కిసాన్‌ జిల్లా అధ్యక్షుడు గౌస్‌, యువ జన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:39 PM