పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:53 PM
బీజేపీ సంస్థాగత నిర్మాణం, ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగులు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగులు
గద్వాల, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సంస్థాగత నిర్మాణం, ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగులు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం డీకే బంగ్లాలో ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈనెల 6నుంచి 14వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 6, 7తేదీల్లో ప్రతి ప్రాథమిక సభ్యులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని సూచించారు. 8, 9వ తేదీల్లో మండల స్థాయిలో సదస్సులు నిర్వహించి ముగ్గురు క్రియాశీల స భ్యులచే వివిధ అంశాలపై ప్రజలకు వివరించాలని, 10, 11, 12తేదీల్లో గావ్ ఛలో- బస్తీ ఛలో కార్యక్రమం నిర్వహించి దేవాలయం, ఆసుపత్రు లు, పాఠశాల ఆవరణలో స్వఛ్చ భారత్ కార్యక్ర మం నిర్వహించాలని, 13, 14తేదీల్లో బూత్ కమిటీ సమావేశం నిర్వహించాలని చెప్పారు. అ నంతరం అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయం తి ఉత్సవాలను పురస్కరించుకొని అటల్ జీ జీవిత చరిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించా రు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు డికే స్నిగ్దారె డ్డి, రవికుమార్ ఎగ్బోటే, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రజక జయ శ్రీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అక్కల రమాదేవి, బండ ల వెంకట్రాములు పాల్గొన్నారు.