అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:37 PM
అంబేడ్కర్ ఆశయాలను కొనసా గిద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

- మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి
- పూలమాలలతో నివాళులర్పించిన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు
మక్తల్ రూరల్/నారాయణపేట/దామరగిద్ద/ కోస్గి/నారాయణపేట రూరల్/కోస్గి రూరల్/ మాగనూరు/మరికల్ /కొత్తపల్లి/కృష్ణ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ ఆశయాలను కొనసా గిద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మండల వ్యాప్తంగా సోమవారం అం బేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపు కున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటా లకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. మంథన్‌గోడ్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్‌పర్సన్ రాధాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాలకృష్ణ, కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ యోగేష్ గౌతమ్ పూలమాలలు వేసి ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దే శం చేసిన మహానీయుడని కొనియాడారు. కార్య క్రమంలో ఎస్‌ఐలు నరేష్, రమేష్, పోలీస్ సిబ్బం ది పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు, బీ జేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ధన్వాడలో అంబేడ్కర్ విగ్రహానికి భీష్మ ఫౌండేషన్ చైర్మన్ రాజ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. పీఆర్టీయూ, తపస్, టీఎస్‌యూటీఎఫ్ నా యకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. డీఈవో కార్యాలయం వద్ద జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాశ్ తదిత రులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
దామరగిద్ద మండల కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రోడ్ల గుండా యువకులు అంబేడ్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కానుకుర్తిలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్‌కుమార్‌రెడ్డి పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవగౌడ్, సీపీఎం, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
కోస్గి పట్టణంలో జైభీం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మండల నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలో అం బేడ్కర్ విగ్రహానికి బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ జడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల మహిపాల్, సలీం, వీరారెడ్డి, మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ బోడ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అఽధ్యక్షుడు కోట్ల మహేందర్ రెడ్డి, సవారి శ్రీనివాస్, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పేట మండలంతో పాటు, గుండుమాల్, మాగనూరు, మరికల్, కృష్ణ మండలంలోని పలు గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు కుల సంఘాల నాయకులు, యువకులు తదిత రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బాపూరులో విగ్రహావిష్కరణ
నారాయణపేట టౌన్ : నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బాపూరు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని అంబేడ్కర్ జాతర జిల్లా అధ్యక్షుడు మహేష్ ఆవిష్కరించారు. అనంతరం మా ట్లాడుతూ లక్షలాది మందికి సత్యం, అహింసా మార్గాన్ని చూపిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా జాతర వర్కింగ్ ప్రెసిడెంట్ మా ధవ్, కోశాధికారి చంటి, ఉపాధ్యక్షురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.