Share News

కొత్త కార్మిక చట్టాలు రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:42 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలు ర ద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ డిమాండ్‌ చేశారు.

కొత్త కార్మిక చట్టాలు రద్దు చేయాలి
జిల్లా కార్యవర్గంతో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ

మక్తల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలు ర ద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ డిమాండ్‌ చేశారు. ఆదివా రం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం రెండవ జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా ఎన్నో పోరా టాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తుం దన్నారు. కార్మికులు ఏళ్ల తరబడి పోరాటం చేసి 44చట్టాలు సాధించుకున్నారని, కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వం వాటిని నాలుగు కోడ్‌లుగా విభ జించి హక్కులు హరిస్తుందన్నారు. రాబోయే కాలంలో కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి పాలకులకు గుణపాఠం చెబుతామన్నారు. కార్య క్రమంలో నర్సింహులు, బాలప్ప, ఎల్లప్ప, సరోజ మ్మ, గౌసియాబేగం పాల్గొన్నారు.

జిల్లా కార్యవర్గం ఎన్నిక

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్య క్షుడిగా నర్సింహులు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్‌, తాయప్ప, కార్యదర్శిగా ఈసరి రమేశ్‌, సహాయ కార్యదర్శులుగా మల్లయ్య, ఆంజనేయులు, నాగ రాజు, వెంకటేశ్‌, జిల్లా సభ్యులుగా చింతల ది న్నె వెంకటయ్య, నందిపాడు వెంకటేశ్‌తోపాటు 25మంది సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Updated Date - Apr 13 , 2025 | 11:42 PM