ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:25 PM
మరికల్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

- ఎస్పీ యోగేష్‌గౌతమ్
మరికల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): మరికల్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్‌లో సిబ్బం ది విధులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలు, రోజువారీగా నమోదవుతున్న ఫిర్యాదుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యా దులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వహించాలన్నారు. కోర్టులో నిందితులకు శిక్ష పడేలా భౌతిక సాక్ష్యంతో పా టు, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలన్నారు. నిరంతరం అప్రమతంగా ఉంటు దొంగతనాల నిర్మూలన, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేయాలన్నారు. సైబర్ నేరాలపై 1930 టోల్ నెంబర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాములు, సిబ్బంది ఉన్నారు.