ముగిసిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:53 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యు వ వికాసం పథకం కొరకు నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తుల స్వీకరణకు సోమవారం చి వరి గడువు ముగిసింది.

జోగుళాంబ గద్వాల జిల్లాలో 24,051 దరఖాస్తుల స్వీకరణ
గద్వాల సర్కిల్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యు వ వికాసం పథకం కొరకు నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తుల స్వీకరణకు సోమవారం చి వరి గడువు ముగిసింది. ప్రభుత్వ అధికార వెబ్ సైట్ ఆన్‌లైన్ సమస్యలున్నాయని పలువురు నిరుద్యోగ యువత నుంచి విన్నపాలు వచ్చినప్పటికీ ప్రభుత్వం గడవు పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గడువు అధికారికంగా పెంచితే సమచారం తెలియపరుస్తామని జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖాధికారి ఎంపీ రమేష్‌బాబు తెలిపారు. చివరి రోజు జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగుల నుంచి 24,051 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. అందులో బీసీలు 12,400, ఈబీసీ 372, ఎస్సీ 8,600, ఎస్టీ 453, ముస్లీం మైనార్టీలు 2,164, క్రి ష్టియన్ మైనార్లీలకు సంబంధించి 62 దరఖాస్తులు ఉన్నాయని వివరించారు. కాగా ఆదివా రం 22,860 దరఖాస్తులు రాగా, సోమవారం చివరి గడువు ఉండడంతో ఒక్క రోజులోనే 1,191 దరఖాస్తులు నమోదయ్యాయి. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువత నుంచి ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆన్ లైన్‌లో సాంకేతిక సమస్య, సైట్ మొరాయించ డం లాంటి సమస్యలు తలెత్తడంతో కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారు.ప్రభుత్వం స్పందించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.