Share News

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఫాసిస్టు విధానాలు విడనాడాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:24 PM

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదా మని సీపీఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి సీహె చ్‌ రాంచందర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఫాసిస్టు విధానాలు విడనాడాలి
తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న నాయకులు

పాలమూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదా మని సీపీఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి సీహె చ్‌ రాంచందర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని తె లంగాణ చౌరస్తాలో నిరస న చేపట్టారు. దేశంలో కార్మికవర్గం భద్రత, మంచి వేతనం కోసం ట్రేడ్‌ యూనియన్‌ ఉద్య మం చేస్తుంటే, మరోవైపు రైతులు ఎంఎస్‌పీ కోసం, గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ, రుణ రద్దు డిమాండ్లతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. మత విద్వేష, విభజన వ్యవహారాన్ని ప్రతీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్రంగా సాగిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీలు సమాజాన్ని అత్యంత విషపూరితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతులు, కార్మికులు, యువత, మహిళలు ఎదురొంటున్న సమస్యల నుంచి దృష్టి మళ్లించటానికి బీజేపీ మత విద్వేషపూరిత ఎజెండాను అమలు చేస్తోంద న్నారు. కార్యక్రమంలో డివిజన్‌ కార్యదర్శి వెంక టేష్‌, దేవదానం, సాంబశివుడు, కొండారెడ్డి, ఆర్‌.ఆర్‌ మన్యం, గణేష్‌, బాలు, వెంకట్రాములు, నరసింహులు, అడివన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:24 PM