Share News

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:23 PM

ప్రతి కొ నుగోలు కేంద్రాలలో సన్న, దొడ్డు రకం ధాన్యం కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌రావు సూచిం చారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, అధికారులు

- రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రతి కొ నుగోలు కేంద్రాలలో సన్న, దొడ్డు రకం ధాన్యం కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌రావు సూచిం చారు. జిల్లా సహకార శాఖ, మహబూబ్‌ నగర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి మం గళవారం కలెక్టరేట్‌లో శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని కొనుగోలు కేం ద్రాలు ఈ వారంలో ప్రారంభించాలన్నారు. సన్నరకం బస్తాలను ఎరుపు రంగు దారంతో కుట్లు వేసి ఆ బస్తాపై ముద్ర వేయాలన్నారు. ధాన్యం తూర్పార బట్టి శుభ్రం చేసిన తర్వాత కొనాలన్నారు. కొన్న తర్వాత రైతులకు రశీదు ఇ వ్వాలని, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిం చాలన్నారు. ప్రభుత్వం సన్న రకంపై ఇచ్చే రూ.500 బోనస్‌ గురించి రైతులకు తెలియజే యాలని సూచించారు. శంకరాచారి, హేమలత, రవినాయక్‌, టైటస్‌పాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:23 PM