TG News: నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత
ABN, Publish Date - Jan 20 , 2025 | 11:53 AM
నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం (Mylaram) గ్రామం (Village)లో ఉద్రిక్తత (Tension) పరిస్థితి నెలకొంది. మైనింగ్ (Mining)కు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన (Protest) కొనసాగుతోంది. అయితే రైతులు, గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్రమ అరెస్టులు ఆపాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి పోలీసులు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. మైలారం గ్రామంలో ఉండే గుట్టపై క్వార్డ్జ్ ఖనిజాలను మైనింగ్ చేసేందుకు అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా అక్కడ మైనింగ్ జరుగుతోంది. అనుమతుల నియమాలకు వ్యతిరేకంగా ఈ మైనింగ్ జరుగుతోందని పేర్కొంటూ గ్రామస్తులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు. మైనింగ్‌పై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని, గ్రామ తీర్మానం కూడా ఫేక్‌గా సృష్టించి మైనింగ్ జరుపుతున్నారని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
పోలీసులపై మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇటీవల హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ప్రొఫెసర్ హరగోపాల్ కూడా సంఘీభావం తెలిపారు. దీంతో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని గ్రామ సభ తీర్మానించింది. దీనికి హరగోపాల్‌ను ముఖ్య అతిధిగా పిలిచారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు గ్రామానికి వచ్చి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మహిళలు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా కంచె వేసి పోలీసులు రావద్దంటూ మహిళలు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన చేపట్టారు. చాలా కాలంగా మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కాగా నాగర్ కర్నూలు జిల్లా, బల్మూర్ మండలం, మైలారం గ్రామంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మైలారం మైనింగ్ వెలికితీత కార్యక్రమాన్ని నిలిపివేయాలని గత మూడు నెలలుగా ఆ గ్రామస్తులు శాంతియుత పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని మహిళలను, రైతులను అరెస్ట్ చేశారు. అలాగే అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.
ఈ వార్తలు కూడా చదవండి..
క్రమశిక్షణా కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి
హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 20 , 2025 | 11:53 AM