Share News

డేంజర్‌ జోన్‌ వరకు వెంటిలేషన్‌ పునరుద్ధరణ

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:18 PM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో డేంజర్‌ జోన్‌ ఏరియా సమీపం వరకు వెం టిలేషన్‌ వ్యవస్థను పునరుద్ధర ణ చేపటినట్లు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రత్యేకాధికారి శివ శంకర్‌ లోతేటి తెలిపారు.

 డేంజర్‌ జోన్‌ వరకు వెంటిలేషన్‌ పునరుద్ధరణ
సొరంగంలో డేంజర్‌ జోన్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్న రెస్క్యూ సిబ్బంది

- ప్రత్యేకాధికారి శివశంకర్‌ లోతేటి

- మిగిలిన 70 మీటర్లలో 50 మీటర్లకు శిథిలాలు తిరుగతోడిన రెస్క్యూ బృందాలు

- ఆ ఆరుగురి ఆచూకీ 20 మీటర్లలో ఉండొచ్చా..?

- ప్రభుత్వం విధించిన గడువు వరకు శిథిలాల తొలగింపు చర్యలు

దోమలపెంట, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో డేంజర్‌ జోన్‌ ఏరియా సమీపం వరకు వెం టిలేషన్‌ వ్యవస్థను పునరుద్ధర ణ చేపటినట్లు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రత్యేకాధికారి శివ శంకర్‌ లోతేటి తెలిపారు. సొరంగ ప్రమాద దుర్ఘ టన జరిగి సోమవారా నికి 52 రోజులు కావ డంతో శిథిలాల కింద చి క్కుకున్న ఆరుగురి కార్మి కుల మృతదేహాలను వెలి కి తీసెందుకు రెస్క్యూ బృం దాలు అన్వేషణ కొనసాగు తుందన్నారు. ప్రమాద ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు రెస్క్యూ బృందాల సహాయక చర్యల్లో పాల్గొంటూ నిత్యం తవ్వకాలు చేడుతున్నా రు. శిథిలాల తొలగింపు పనులు జరుగుతు న్న ప్రాంతం వరకు అవసరమైన ఆక్సిజన్‌ అందించేందుకు వెంటిలేషన్‌ వ్యవస్థను పొడిగించడంతో పాటు, 5 ఎక్స్‌కవేటర్ల ద్వారా బురద మట్టిని తవ్వి కన్వేయర్‌ బెల్ట్‌పై బయటకు పంప డం జరుగుతుంది. బండరాళ్లనూ, టీబీఎం మిషన్‌ శకలాలను కత్తిరించి లోకో ట్రైన్‌లో తరలించడం, నీటి ఊటను ఎప్పటికప్పుడు 5 మోటారు పంపులతో నదిలోకి పంప నున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ట న్నెల్‌ వద్ద రెస్క్యూ బృందాల అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వ హించి సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నా రు. సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తెలెత్తకుండా తగు చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో సింగరేణి జీఎం డీ భైద్య, రెస్క్యూ టీం మేనేజర్లు రాజేందర్‌ రెడ్డి, మాధవరావు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా, రైల్వే అధికారి రవీంద్ర నాథ్‌ జీఎస్‌ఐ, ఇరిగేషన్‌, జేపీ కంపెనీ ప్రాజెక్టు సీనియర్‌ ఇంజనీర్‌ సంజయ్‌కుమా ర్‌ సింగ్‌ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

నేడు శిథిలాలను పూర్తిగా తిరగతోడనున్న రెస్క్యూ సిబ్బంది

ప్రస్తుతం మిగిలిన 70 మీటర్ల శిథిలాల్లో 20 మీటర్ల వరకు పూర్తిగా అడుగు భాగం వరకు మట్టి బురద, ఇనుప శకలాలను తొలగించారు. మిగిలిన 50 మీటర్లలో ఆ ఆరుగురి ఆచూకీ ఏమైనా లభిస్తుందా.. అనే కోణంలో రెస్క్యూ బృందాలు శ్రమిస్తూ శనివారం రాత్రి వరకు 30 మీటర్ల దూరం శిథిలాలను తిరుగ తోడారు. ఒక పక్క సాధ్యమైనంత వరకు శిథిలాలను బయటకు తరిలిస్తూనే, మరోపక్క అణువనువునా రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం 20 మీటర్ల వరకు శిథిలాల పెకిలింపు మిగిలిఉన్నది. మంగళవారం వరకు ఇక్కడ కూడా శిథిలాలను తిరుగతోడే పనుల్లో రెస్క్యూ బృందాలు నిమగ్నం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరుగురి కార్మికుల జాడ త్వరగా గుర్తించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మిగిలిన 20మీటర్లలో కూడా ఎటువంటి ఆచూకీ లభించకపోతే, తదుపరి ప్రణాళికా ఏంటా అని అధికారులు ఆలోచనలో పడ్డారు. డేంజర్‌ జోన్‌గా ప్రకటించిన ఆ 40 మీటర్ల కింద చిక్కుకున టీబీఎం మిషన్‌తో పాటు ఒక వేళ కార్మికులు కూడా అక్కడే ఉంటే, ప్రస్తుతానికి తవ్వకాలు చేపట్టడమంటే ప్రాణాల మీదకు తెచ్చకున్నట్లే అని సహాయక చర్యల్లో పాల్గొనే అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:18 PM